Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రఘువరన్ బి.టెక్'లో ధనుష్ తమ్ముడిగా నటించిన రిషికేశ్ ఇప్పుడు 'బొమ్మల కొలువు' చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో, హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తున్న చిత్రం 'బొమ్మల కొలువు'. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ, 'ప్రవీణ్ చక్కటి బిజి.ఎం. ఇచ్చి సంగీతంతో సినిమా మరో స్థాయిలో తీసుకెల్లేలా దోహదపడ్డాడు.. ఎడిటర్ వర్మ పనితీరు బాగుంది. నిర్మాత స్వామిగారు నాపై నమ్మకంతో రెండో సినిమా చేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది' అని చెప్పారు. 'దర్శకుడు సుబ్బు ఎక్సెలెంట్ మూవీ తీశారు. ఇందులో అన్ని అంశాలున్నాయి. థ్రిల్లర్లో చక్కటి చిత్రమవుతుంది. ఈ సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని విజ్జప్తి చేస్తున్నాం' అని నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి చెప్పారు.
సినిమాటోగాఫ్రర్ ఈశ్వర్ మాట్లాడుతూ, 'సుబ్బుగారితో ఇది రెండో సినిమా. ఇంతకుముందు 'రాహూ' సినిమా చేశాను. ఈ సినిమా కంప్లీట్ థ్రిల్లర్. హీరో, హీరోయిన్లు ఇద్దరూ బాగా నటించారు. ఏప్రిల్ 22న సినిమాని చూసి ఆనందించండి' అని తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, పాటలు: శ్రీనివాస మౌళి.