Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నాయకానాయికలు గౌతమ్ రాజ్, సాయి విక్రాంత్ హీరోలుగా, మధుప్రియ, లావణ్య శర్మ, సిరి, అంబిక హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం 'అమ్మ నాన్న మధ్యలో మధురవాణి'.
పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బందాకర్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెక్కం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా, ఫణి కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గౌరవ దర్శకత్వం చేశారు.
ఈ చిత్రంలో నరేష్ వీకే, పవిత్ర లోకేష్, నందమూరి తారకరత్న, కెప్టెన్ చౌదరి, బేబీ శరణ్య, మాస్టర్ రాకేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'రెండు తరాలకు కనెక్ట్ అయ్యే కథ ఇది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, రెండు షెడ్యూల్స్‌లో ఫినిష్ చేస్తాం' అని చెప్పారు. 'మా అబ్బాయి గౌతమ్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కుటుంబ సమేతంగా చూసే చిత్రం ఇది' అని నిర్మాత బందాకర్ గౌడ్ అన్నారు.