Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రెనసాన్స్ ఫిలింస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. సాయి మంజ్రేకర్ నాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్ని పోషించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద బుధవారం మీడియాతో మాట్లాడారు.
నిర్మాతల్లో ఒకరైన అల్లు బాబీ మాట్లాడుతూ, ''తొలిప్రేమ','అంతరిక్షం' సినిమాల నుండి వరుణ్‌తో దర్శకుడు కిరణ్ జర్నీ చేస్తున్నాడు. కిరణ్ డైరెక్ట్ చేయగలడు అని అనుకున్న తర్వాత ఈ కథ రెడీ అయ్యింది. అయితే బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచన మాత్రం వరుణ్‌ది. అలాగే టైటిల్‌ని కూడా తనే సూచించాడు. చాలా నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ సినిమా. నిర్మాతగా నాకు, దర్శకుడిగా కిరణ్‌కు తొలి చిత్రం. అయినప్పటికీ ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమా నిర్మించాం. క్రీడా రాజకీయాలను స్పశిస్తూ కథ సాగుతుంది. 'అమ్మ నాన్న తమిళమ్మాయి' సినిమా తరువాత బాక్సింగ్ నేపథ్యంలో సినిమాలు రాలేదు.ఆ సినిమా అమ్మ, నాన్న, కొడుకు మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా, అయితే ఇది మాత్రం ఫూర్లీ వరుణ్ జర్నీ . తెలుగులో తొలిసారి ప్రొఫెషనల్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ. నాకు తెలిసి ఇండియాలో ప్రో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు 'గురు', 'తుఫాన్' తరువాత మన తెలుగు సినిమా 'గని' మాత్రమే. బాక్సింగ్‌లో రియాలిటీ ఉండాలని యూఎస్‌లో ఉండే ఒలింపిక్ మోడల్ విన్నర్ టోనీ జఫ్రీస్ దగ్గర వరుణ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తరువాత ఇండిjలో నీరజ్ గోయల్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. వరుణ్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. బాక్సింగ్ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో రెండు సార్లు సెట్స్ వేశాం. కథని చెప్పిన విధంగానే కిరణ్ తెర పైకి తెచ్చాడు. నిర్మాతగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని సొంత బ్యానర్లో సినిమాలు తీస్తున్నాను. కథ, సినిమా నిర్మాణ విషయంలో నాన్నగారు (అల్లు అరవింద్) ఇచ్చిన సూచనలు, సలహాలు చాలా ఉపయోగపడ్డాయి' అని తెలిపారు.
'5 సంవత్సరాల క్రితం ఈ సినిమాని మొదలు పెట్టాం. అప్పుడు మేం పాన్ ఇండియా విజన్‌తో ఈ సినిమా స్టార్ట్ చేయలేదు. కథకు అవసరం కావడంతో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా వంటి సీనియర్లను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. వీరందరూ అద్బుతంగా నటించారు. వీళ్ళంతా యాక్ట్ చేసినందుకే అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ప్రస్తుతం తెలుగు, కన్నడలో మాత్రమే విడుదల చేస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని మరో నిర్మాత సిద్దు ముద్ద అన్నారు.