Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. 'కలర్ ఫొటో' సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. భిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో యువ కథానాయకుడు విశ్వక్ సేన్ పవర్ఫుల్ లాయర్‌గా ఓ స్పెషల్ రోల్ పోషించారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'ఇందులో లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ మెరవబోతున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు పాటు ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీగా ప్రెజెంట్ చేశాయి. ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్‌తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఉండబోతుందని వేరే చెప్పక్కర్లేదు. విశ్వక్ సేన్ ఉండటంతో సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం : కాల భైరవ, ఎడిటింగ్ : పవన్ కళ్యాణ్.