Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ప్రస్తుతం 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఇదే కాంబినేషన్లో మరో పాన్ ఇండియా సినిమాని మేకర్స్ ప్రకటించారు.
'జేజీఎమ్' (జనగణ మన).. అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని బుధవారం ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఇండియా మేప్తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని పోస్టర్ చెప్పకనే చెబుతోంది. సోల్జర్ గెటప్‌లో ఉన్న విజరు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న కంప్లీట్ యాక్షన్ఎంటర్టైనర్ ఇది.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ, 'విజరుతో మా తదుపరి ప్రాజెక్ట్ 'జేజీఎమ్' చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. తనతో మళ్లీ కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది 'జేజీఎమ్' ఒక బలమైన కథనం. అంతేకాదు ఇదొక అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా' అని చెప్పారు.
'ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా, ఛాలెంజింగ్‌గా ఉంది. కథ చాలా ప్రత్యేకమైనది. ప్రతి భారతీయుడినీ టచ్ చేస్తుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. గతంలో చేయనటువంటి పాత్ర చేస్తున్నా. ఇది ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నా' అని హీరో విజరు దేవరకొండ అన్నారు.
నిర్మాతలు వంశీ పైడిపల్లి, శ్రీకర స్టూడియో అధినేత సింగారావు మాట్లాడుతూ, 'ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమా ప్రతి భారతీయుడిని తట్టిలేపుతుందనే నమ్మకంతో ఉన్నాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతుంది,
2023.. ఆగస్టు3న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.