Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో నటుడిగా ప్రేక్షకులను మెప్పించి, పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు విశ్వక్ సేన్. ఆ తర్వాత 'ఫలక్నామా దాస్' నుంచి 'దాస్ కా ధమ్కీ' వరకు భిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుని అందర్నీ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ పుట్టినరోజు వేడుక మంగళవారం రాత్రి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్సేన్పై విడుదల చేసిన స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంది.
'ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అనేలా నా చిత్రాలుంటాయి. 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'ఓరి దేవుడా' (ఇందులో దేవుడి పాత్రను స్టార్ హీరో చేయబోతున్నారు), 'దాస్ కా ధమ్కీ', 'లేడీస్ నైట్' వీటితోపాటు యువి.క్రియేషన్స్‌లో 'గామి' అనే భారీ సినిమా చేస్తున్నా. స్టూటెండ్ లీడర్‌గా 'స్టూడెంట్ జిందాబాద్', 'ది ఫలక్ నామా దాస్ 2' చిత్రాల్ని త్వరలోనే చేయబోతున్నా. కథ, పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలోనైనా నటిస్తా. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 'ముఖ చిత్రం'. ఇందులో పవర్ఫుల్ లాయర్‌గా కనిపిస్తా. నేను ఏది చేసినా ప్రేక్షకుల్ని, నా అభిమానుల్ని అలరించడమే నా లక్ష్యం' అని కథానాయకుడు విశ్వక్సేన్ చెప్పారు.