Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ డేట్ ఇన్ ద డార్క్' వంటి విభిన్నమైన లఘుచిత్రంతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు శింగర మోహన్ తన మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
'కాలమేగా కరిగింది..?' అనే టైటిల్‌తో తన సోదరుడు శివ శంకర్ నిర్మాతగా ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నట్టు దర్శకుడు శింగర మోహన్ తెలిపారు.
'నూతన నటీ నటులు, సాంకేతిక నిపుణులతో చేస్తున్న ఈ చిత్రం జ్ఞాపకాల మీద నడిచే ఒక కవితాత్మక మైన ప్రేమ కథ. ప్రేక్షకులను ఓసారి తమ కాలాన్ని తిరగేసేలా ఈ సినిమా చేయనుంది. 90 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. గీత రచయిత తిరునగరి శరత్ చంద్రతో కలిసి నేనూ గీత రచన చేశాను. ఈ పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకుడు శింగర మోహన్ చెప్పారు. వినరు కుమార్, శ్రావణి మజ్జారి, అరవింద్ ముదిగొండ, నొమినా తారా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వినీత్ పబ్బతి , సంగీతం : గుడప్పన్, పాటలు : తిరునగరి శరత్ చంద్ర, ఎడిటర్: నరేష్ అడూప.