Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడే క్రికెట్ మ్యాచ్ క్రీడాభిమానుల్లో స్ఫూర్తి నింపుతాయి.
అలాగే సినిమా తారలు ఆడే మ్యాచ్‌లు ప్రేక్షకులకు, వాళ్ళ అభిమానులకు బోల్డెంత వినోదాన్ని అందిస్తాయి. తాజాగా టీవీ, సినిమా పరిశ్రమలకు సంబంధించిన కొంత మంది ప్రముఖులు 'సెలబ్రిటీ సూపర్ 7' పేరుతో ఓ లీగ్‌ని నిర్వహించారు.
బహస్పతి టెక్నాలజీస్, బహస్పతి ఎంటర్టైన్మెంట్ నిర్వహించిన ఈ లీడ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తి కరంగా జరిగింది. ఈ లీగ్ ప్రేక్షకులను అలరించడంతోపాటు మరెన్నో క్రికెట్ రికార్డులను కూడా అధిగమించడం విశేషం. అలాగే ప్రతి మ్యాచ్‌లో దాదాపు 50 మందికి పైగా టీవీ, సినిమా సెలబ్రిటీలు పాల్గొని హల్చల్ చేశారు. బహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగి, తిరుపతి టైగర్స్ సమీర్ టీం విజేతగా, కరీంనగర్ కింగ్స్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక లీగ్‌కి సంబంధించిన మరో సీజన్‌ను కూడా రాబోయే జూన్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ తరహాలో ఈసారి భారీ స్థాయిలో దీన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.