Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాక్సర్ కావాల్సిన వాడ్ని యాక్టర్ అయ్యాను. అయితే నా కలని 'గని' సినిమా నెరవేర్చటం చాలా ఆనందంగా ఉంది' అని యువ కథానాయకుడు నవీన్ చంద్ర చెప్పారు.
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన చిత్రం 'గని'.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రెనసాన్స్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. సయీ మంజ్రేకర్ నాయికగా, జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. దీన్ని ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నవీన్‌చంద్ర మీడియాతో మాట్లాడుతూ,
'ఈ సినిమాలో ఆది అనే బాక్సర్ క్యారెక్టర్లో నటించా. నాకు చిన్నప్పట్నుంచి బాక్సర్ కావాలని ఉండేది. అయితే అనుకోకుండా యాక్టర్ అయ్యా. ఆ కలని 'గని' నెరవేరుస్తుందని ఊహించలేదు. ఇందులో హీరో వరుణ్‌కి ప్రత్యర్థి బాక్సర్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశా. వరుణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాక్సర్‌గా మేం ఫిట్‌గా ఉండటానికి చాలా కష్ట పడ్డాం. ముఖ్యంగా కరోనా టైమ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ కథని, హీరో లక్ష్యాన్ని సాధించే క్రమంలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అరుదైన పాత్ర చేశానని గర్వంగా ఉంది' అని చెప్పారు.