Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందు తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్'. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించి దుబారులో ఓ కీలక షూటింగ్ షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది.
'ఈ షెడ్యూల్లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్‌గా, గ్రాండ్ స్కేల్లో ఉన్నాయి. యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్‌ని ఆస్వాదించే వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. దుబారులో షూటింగ్ పూర్తయిన సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు' అని చిత్రయూనిట్ తెలిపింది.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి., యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కిచ్చా, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.