Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మాత శ్రీనివాస్ నిర్మించనున్న చిత్రం 'బారసాల'. ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకష్ణగౌడ్, లయన్ సాయి వెంకట్ ఈ చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,'నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. నిర్మాత శ్రీనివాస్ గారు మంచి అభిరుచిగల వ్యక్తి కావడంతోపాటు మంచి రచయిత కావడం కూడా మా సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది' అని చెప్పారు.
'రచయితగా ఉన్న నేను నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది. అందరినీ అలరించే అంశాలతో పాటు, కమర్షియల్ హంగులు కూడా ఇందులో ఉంటాయి' అని నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకష్ణగౌడ్ మాట్లాడుతూ, 'శ్రీనివాస్ గారు చేస్తున్న ఈ 'బారసాల' అటు థియేటర్స్‌తో పాటు, ఇటు ఓటీటీ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌పై కూడా విజయం సాధించాలి' అని అన్నారు.
'మనిషి జీవిత ప్రయాణం మొదలయ్యేది బారసాలతోనే. అటువంటి ముఖ్యమైన ఘట్టాన్ని టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది' అని దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్ చెప్పారు. మరో నిర్మాత టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'దర్శకుడు శ్రీనివాసరెడ్డి అనుభవశాలి. నిర్మాత శ్రీనివాస్ గారు కూడా మంచి రచయిత కావడం ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. ఈ డెఫినెట్‌గా విజయం సాధిస్తుంది' అని తెలిపారు.