Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''పక్కా కమర్షియల్' టైటిల్‌కు అటు ఇండిస్టీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ సైతం అద్భుతమైన స్పందన రాబట్టుకుని, సినిమాపై భారీ అంచనాలను పెంచింది. కథానుగుణంగా హీరో గోపీచంద్ క్యారెక్టర్‌ను దర్శకుడు మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే' లాంటి విజయాలతో దూసుకుపోతున్న జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో అందరిలో అమితాసక్తి నెలకొని ఉంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలేభలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. 'ప్రతి రోజు పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజారు సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే పక్కా కమర్షియల్ చిత్రమనే దీమాతో మేకర్స్ ఉన్నారు' అని చెప్పారు.
రావు రమేష్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, సహ నిర్మాత - ఎస్ కే ఎన్, లైన్ ప్రొడ్యూసర్ - బాబు, ఎడిటింగ్ - ఎన్.పి.ఉద్భవ్, సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల.