Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫే˜మ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. ఎన్.ఎం.పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ, 'కొన్ని ఫంక్షన్లకు ప్రేమతో వస్తాం. నిర్మాత నిరంజన్ రెడ్డిపై ఉన్న సోదర ప్రేమతో ఈ ప్రీ రిలీజ్‌కి వచ్చాను. ఒకవైపు సుప్రీం కోర్డు లాయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలు తీయడం ఆశ్చర్యం కలిగింది. నాతో 'ఆచార్య' చేస్తున్నాడు. ఇప్పుడు 'మిషన్ ఇంపాజిబుల్' చేశారు' అని తెలిపారు.
''ఝుమ్మంది నాదం' సినిమా ఆడియో రిలీజ్‌కి చిరంజీవిగారు వచ్చారు. నాకు అది స్పెషల్ మూవీ. ఆయన ఆశీస్సులు మరోసారి దక్కాయి. నిరంజన్‌రెడ్డిగారు నాకు 'ఘాజీ' సినిమాలో అవకాశం ఇచ్చారు. దర్శకుడు స్వరూప్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు ముగ్గురు పిల్లలే హీరోలు. నేను చేసిన సినిమాలన్నింటిలోకీ యంగెస్ట్ హీరోలు వీరే. నేను రెండేళ్ళుగా హిందీలో బిజీగా ఉన్నాను. ఇకపై తెలుగులోనూ మరిన్ని సినిమాలు చేస్తాను' అని తాప్సీ చెప్పారు.
దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ, 'నేను చేసిన 'ఏజెంట్..' సినిమాకు స్పూర్తి చిరంజీవిగారి 'చంటబ్బారు'. నేను చిరంజీవిగారి అభిమానిని. ఈ కథ రీత్యా స్ట్రాంగ్ హీరోయిన్ కావాలనుకున్నాం. తాప్సీగారు హిందీలో 'పింక్' వంటి అద్భుతమైన సినిమాలు చేశారు. ఆమె ఈ కథలో 45 నిముషాలు మాత్రమే ఉంటుంది. పాత్ర నిడివికాదు. కథ నచ్చి అంగీకరించారు. రెండుగంటలూ నవ్వేలా ఈ సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నాను. నిర్మాతలు లేనిదే ఈ ప్రాజెక్ట్ లేదు. నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 'మహేష్‌బాబు ట్రైలర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిరంజీవిగారు రావడం సక్సెస్‌గా భావిస్తున్నాం. స్వరూప్ చేసిన మొదటి సినిమా చూడలేదు. అయితే నా స్నేహితులు బాగుందని చెప్పారు. సినిమా చూశాక దర్శకుడితో ఏదైనా కథ ఉంటే రమ్మన్నాను. తను చెప్పిన కథ వింటూనే నవ్వుతూనే ఉన్నాను. ఇలాంటి కథకు కీలక పాత్రలో తాప్సీ ఉంటే బాగుంటుందని ఎంపిక చేశాం' అని చెప్పారు.
సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. మేటర్, మెటీరియల్, టాలెంట్ వున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమాతో మరింత నిరూపించుకుంటాడు. చిన్న పిల్లల సినిమా అంటాం. కానీ ఇది పెద్దలు చూడాల్సిన సినిమా. నిర్మాత నిరంజన్ రెడ్డి కథ ఎంపిక చేశారంటే ఒక మార్క్ ఉంటుంది. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి. ఎవ్వరినీ నిరాశపరచదు.
- చిరంజీవి