Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా 'గని'. అల్లు బాబీ కంపెనీ, రెజనెస్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి అన్ని భాషల ఓటీటీతోపాటు శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయని చిత్ర బృందం గురువారం అధికారికంగా తెలిపింది. సినిమా రిలీజ్‌కి ముందే ఇంత భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగటంతో మేకర్స్ ఆనందంతోపాటు సినిమా ఘన విజయంపై దీమా వ్యక్తం చేశారు.
'ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటీటీ, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ వల్లే ఈ సినిమాకు భారీ బిజినెస్ జరగటం మేకర్స్ విశేషంగా భావిస్తున్నారు. సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు. బాలీవుడ్ నాయిక సయీ మంజ్రేకర్ నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్ని పోషించారు.
జార్జ్ సి విలియమ్స్ కెమెరా పనితనం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, తమన్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు' అని చెప్పారు.