Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ (74) ఇకలేరు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉత్తమాభి రుచిగల దర్శకుడిగా శరత్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలో క్వాలిటీగా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. 'చాదస్తపు మొగుడు', 'పెద్దింటి అల్లుడు', 'వంశోద్ధా రకుడు', 'సుల్తాన్', 'సూపర్ మొగుడు', 'బంధువు లొస్తున్నారు జాగ్రత్త' వంటి తదితర చిత్రాలు శరత్ దర్శకత్వంలో రూపొంది, మంచి ఆదరణ పొందాయి. శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శరత్ ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
శరత్‌తో నేను 'వంశానికొక్కడు', 'పెద్దన్నయ్య', 'సుల్తాన్', 'వంశోద్ధారకుడు' చిత్రాలు చేశాను. మంచి మనిషి, నిస్వార్థపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. - నందమూరి బాలకృష్ణ