Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనూష శర్మ, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి, అనిత, కార్తి దేవల్రాజు, నందిని, బలరాం తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'నో రామా.. రావన్స్ ఓన్లీ'.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్స్ కట్ సినిమా బ్యానర్‌పై వీర బ్రహ్మం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పసి వయసులో మనసుకి అయ్యే గాయాలు జీవితాలను ఎలా వేధిస్తాయి అనే సెంటిమెంట్ పాయింట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ర్యాపో వర్షెన్‌లో చిత్రీకరించిన డిటెక్టీవ్ ఎఫ్ పూర్తి వీడియో సాంగ్‌ని డైరెక్టర్స్ కట్ సినిమా యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వీర బ్రహ్మం మాట్లాడుతూ, 'ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే చిత్రమిది. సినిమా అద్భుతంగా వచ్చింది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన డిటెక్టీవ్ ఎఫ్ సాంగ్‌కి అనూహ్య స్పందన లభించడం హ్యాపీగా ఉంది' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా : అశోక్‌కుమార్ మట్టపూడి, ప్రొడక్షన్ డిజైనర్ : పాపారాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం, నిర్మాత : వీర బ్రహ్మం నక్కా.