Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కాలింగ్ సహస్ర'. అరుణ్ విక్కీరాలా దర్శకుడు. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేసి, టీజర్ చాలా బాగుందంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.
'ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. అంతేకాదు గతంలో ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. 'బతకడం కోసం చంపడం సష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరిత మిస్టరీని తలపించింది. 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా, మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్ళు పోవడం' అంటూ ఈ సినిమాలో లవ్ యాంగిల్ కూడా ఉందని చూపించారు. ఈ సినిమాలో సుధీర్ పోషించిన పాత్ర అందరినీ కచ్చితంగా అలరిస్తుంది. గతంలో తానుపోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రని చేశారు' అని చిత్ర బృందం తెలిపింది.
సుధీర్ ఆనంద్ భయాన, శివ బాలాజీ మనోహరన్, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్, రవితేజ నన్నిమాల తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఓపీ : సన్నీ డి., మ్యూజిక్: మోహిత్ రహ్మణియక్, యాక్షన్: శివరాజ్, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్., ప్రొడక్షన్ డిజైన్: తాళ్లూరి మణికంఠ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణ్ కోయిలదా.