Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు శివనాగేశ్వరరావుది విలక్షణ శైలి. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో అందర్నీ మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'దోచేవారెవరురా' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
ఉగాది పండగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం ఆవిష్కరించారు. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో అజరు ఘోష్, బిత్తిరి సత్తి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్‌లుక్, టీజర్‌ని రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ, 'మా చిత్ర టైటిల్ లోగోను రామ్‌గోపాల్ వర్మ ఆవిష్కరించటం ఆనందంగా ఉంది. 'మనీ', 'సిసింద్రి', 'పట్టుకోండి చూద్దాం' తరహాలోనే ఈ సినిమా కూడా ఆద్యంతం అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. నయా కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది' అని తెలిపారు.