Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నాయిక అనుష్క శెట్టి, యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు యు.వి.క్రియేషన్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని మహేష్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 4 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''సాహో', 'రాధే శ్యామ్' లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క హ్యాట్రిక్ సినిమా చేస్తుండటం విశేషం. అలాగే అనుష్కకు ఇది 48వ సినిమా కావడం మరో విశేషం. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' (2018), లేడీ ఓరియెంటెడ్ సినిమా 'భాగమతి'లోనూ అనుష్క నటించారు. 'మిర్చి' ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికీ విదితమే. 'భాగమతి' సినిమా కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో అనుష్క కనిపించబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్‌తో త్వరలోనే ప్రకటించనున్నారు' అని చెప్పారు.