Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్లో నిర్మించిన చిత్రం '105 మినిట్స్'.
ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య భూమిక పోషించిన హన్సిక మాట్లాడుతూ, 'సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌తో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన ఈ చిత్రం నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. విజువల్స్ చూశాక షూటింగ్లో పడిన కష్టం అంతా మర్చిపోయాను. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చే సినిమా ఇది' అని తెలిపారు.
'సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో దాన్ని చాలా అద్భుతంగా తీసాడు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉంది. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ, 'హన్సిక నటనతోపాటు డిఒపి కిషోర్ కెమెరా వర్క్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.యస్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్స్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ప్రొడక్షన్స్ డిజైనర్ బ్రహ్మ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. సినిమాని త్వరలోనే విడుదల చేయబోతున్నాం' అని చెప్పారు.