Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. సీనియర్ దర్శకులు కోడి రామకష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా దీన్ని నిర్మిస్తున్నారు. కార్తిక్ శంకర్‌ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
'రాజాగారు రాణిగారు' 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి పూర్తయ్యింది. ఉగాది పర్వదినం నేపథ్యంలో ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. 'లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న.. బెయిల్ ఇచ్చి పోరాదే..పడిపోరాదే.. పడిపోరాదే.. నాకే నువ్వు పడరాదే..' అంటూ సాగే మాస్ బీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పక్కా కమర్షియల్ పంథాలో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్ర ఆడియోని లహరి ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీ కష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : కోడి రామకష్ణ, లిరిక్స్ : భాస్కర్ భట్ల, ఎడిటర్ : ప్రవీన్ పూడి, ఆర్ట్ డైరక్టర్ : ఉపేంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భరత్ రొంగాలి, సినిమాటోగ్రఫీ : రాజ్ నల్లి, సంగీతం.. మణిశర్మ, కో ప్రొడ్యూసర్: నరేష్ రెడ్ది ములే, నిర్మాత : కోడి దివ్య దీప్తి.