Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'క్రాక్', 'నాంది' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను వరలక్ష్మి శరత్ కుమార్ మెస్మరైజ్ చేశారు. మహిళా ప్రధాన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.తాజాగా ఆమె నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'వర ఐపీఎస్'. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బందం విడుదల చేసింది.
తలైవసల్ విజరు, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి తదితరులు నటించారు.
శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ దక్కించుకుంది. 'తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందించడంలో శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏఎన్ బాలాజీది ప్రత్యేక శైలి. అభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన ఆయన ఈ చిత్రాన్ని సైతం తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. లేటెస్ట్గా విడుదలైన వరలక్ష్మి శరత్‌కుమార్ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.
సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో, సినిమాలతో వరలక్ష్మి శరత్‌కుమార్ ఆమె కంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోనూ పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయనున్నారు.
వర.. ఐపీఎస్‌గా ఆమె ఏం చేసిందనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆమె నటన హైలెట్‌గా నిలుస్తుంది. 'ఒరేరు బామ్మర్ది' వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తికర సినిమా రావడం విశేషం. ఈ సినిమాకి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కేజీఎఫ్' లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మాథ్యూస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత బాలాజీ ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.