Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సెక్సీ స్టార్'. ఓ కొడుకు వ్యథ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు.
చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ,'నేను నటించిన ఈ చిత్ర్ర పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషగా ఉంది. చిత్రీకరణలో పాల్గొన్నంత వరకు, నేను చేసిన సన్నివేశాలను దర్శక, నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తీశారు. హీరో కుప్పిలి శ్రీనివాస్‌కు మంచి టేస్ట్ ఉంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది'' అని తెలిపారు. ఈ కథను తెలుగుతో పాటు మిగతా భాషల్లో డబ్బింగ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాలో నటంచానని సంతోషంగా ఉంది' అని తెలిపారు.
'నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడమే కాదు. మా మూవీ పోస్టర్‌ను లాంచ్ చేయడం సంతోషగా ఉంది. ఇందులో నేను పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్‌తో చేసిన ఈ సినిమా ప్రేక్షకుల దీవెనలతో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని హీరో కుప్పిలి శ్రీనివాస్ అన్నారు.
రచయిత శివప్రసాద్ ధరణ కోట మాట్లాడుతూ, 'సెక్సీ స్టార్ 'అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు . సెక్సీ అనేది చాలా పవిత్రమైన పదం.. బాగా ఉందని చెప్పడానికి ఈ పదం వాడుతాం. ఈ చిత్రానికి మంచి డైలాగ్స్ రాశాను. హీరో బాగా నటించారు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది' అని అన్నారు.
'ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. పాటలన్ని బాగా వచ్చాయి. ఇవన్ని అందరికీ నచ్చుతాయి. సినిమా కూడా అందరికి నచ్చుతుంది' అని సంగీత దర్శకులు జై సూర్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ హంగామా కష్ణ , కెమెరా మెన్ పొడిపై రెడ్డి శ్రీను, గబ్బర్ సింగ్ బ్యాచ్‌తో పాటు వివేకానంద నగర్ కాలనీ నాయకులు పాల్గొన్నారు.
కుప్పిలి శ్రీనివాస్ (హీరో), హ్రితిక సింగ్, సాధన పవన్ (హీరోయిన్స్) నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, సమీర్, కష్ణ భగవాన్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమర్పణ : చిన్ని కుప్పిలి, కథ, నిర్మాత : లయన్ కుప్పిలి వీరచారి, కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్, పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్ శ్రీరామ్, జై సూర్య.