Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మా ఇష్టం'. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా నిర్మాత టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ,' ఇంతటి అద్భుతమైన సినిమాని వర్మ తప్ప వేరే ఏ డైరెక్టర్ చేయలేడు అని సగర్వంగా చెబుతాను. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలున్నారు. మా సినిమాలో ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్లు, అర్జీవి ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది. ఒక సినిమా హిట్ అవ్వడానికి ఏవైతే కావాలో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి' అని చెప్పారు. 'ఇదొక క్రైమ్ డ్రామా మూవీ. అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్. ఆ పాత్రలలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. వరల్డ్‌లోనే ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ పాట చిత్రీకరించడం జరగలేదు. ఈనెల 8న ఈ సినిమా రాబోతుంది. అందరూ చూసి ఎంజారు చేయండి' అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.