Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా 'గని'. అల్లు బాబీ కంపెనీ, రెజెనెన్స్ పిిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకుని వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ,'ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా ఫ్యామిలీలో నాన్నగారు అల్లు అరవింద్ తర్వాత తమ్ముడు శిరీష్ నిర్మాత అవుతాడని అనుకున్న.. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు మా అన్నయ్య అల్లు బాబీ అధికారికంగా నిర్మాతగా మారి, మొదటి సినిమా చేశాడు. ఇది బాబీకి మొదటి సినిమా అయి ఉండొచ్చు, కానీ నా ప్రతి సినిమా విషయంలో బాబీ జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది. తను ఒక కథ ఎంపిక చేసుకుని సినిమా చేసాడంటే ఖచ్చితంగా అది హిట్. సిద్దు ముద్ద ఎన్నో కష్టాలు పడి.. ఇండిస్టీకి వచ్చిన ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. నా బ్రదర్ వరుణ్ తేజ్ ఎంచుకునే కథలంటే నాకు చాలా ఇష్టం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి కథలో ఒక నావెల్టీ ఉంటుంది. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం అందరు హీరోలకు సాధ్యం కాదు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు. కానీ దీని కోసం ప్రాణం పెట్టాడు. నేను సినిమా చూశాను. దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా తీశారు' అని చెప్పారు.
'ఈ సినిమా నాకు మూడేళ్ల కల. నా మీద నమ్మకంతో వరుణ్ తేజ్ ఇంత పెద్ద ప్రాజెక్టు అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో 'తమ్ముడు' సినిమా ఎలాంటి మైల్ స్టోన్‌గా నిలిచిందో, వరుణ్ తేజ్‌కి ఈ సినిమా నిలుస్తుంది' అని దర్శకుడు కిరణ్ కొర్రపాటి అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ,' ఈ సినిమా మూడేళ్ల కష్టం. కరోనా కారణంగా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టారు. ఇక హీరో వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. తాను ఎదగడంతో పాటు తన పక్కన ఉన్న స్నేహితులు కూడా ఎదగడానికి ఉపయోగపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి వరుణ్ తేజ్. ఈ సినిమా అనుకున్నట్టు పూర్తవడానికి ముఖ్యకారణం వరుణ్ తేజ్. అతడితో నేను కచ్చితంగా 'కేజిఎప'˜్ లాంటి ఒక భారీ సినిమా చేస్తా. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దూ ముద్ద ఇద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పట ినుంచి ఒకరి గురించి మరొకరికి తెలుసు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించారు. బాక్సింగ్ ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడటానికి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి.. వస్తారు అని నమ్మకం కూడా ఉంది. ఈ టీమ్ అంతా కలిసి చేసిన ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని తెలిపారు.
'ఈ సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి చేశాం. కచ్చితంగా ఇది మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు 'తమ్ముడు' సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు 'గని' వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండిస్టీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రేపు విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్‌ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్‌గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ తర్వాతే సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు' అని హీరో వరుణ్‌తేజ్ చెప్పారు.