Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై విశ్వంత్, శుభశ్రీ, ఆలీ, సునీల్, రఘుబాబు, ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ నటీనటులుగా ఓ సినిమా రూపొందనుంది. కష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా ఈ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అలీ క్లాప్ నివ్వగా, దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కష్ణ చైతన్య మాట్లాడుతూ,'సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంతో అనుభవం ఉన్న టాలెంటెడ్ టెక్నీషియన్లు, నటీనటులు పని చేస్తున్నారు. నాపై నమ్మకంతో ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజు నుండి ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం' అని చెప్పారు.
'ఉగాది పర్వదినాన మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అథితులందరికీ ధన్యవాదాలు. కష్ణ చైతన్య చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉన్నాం' అని నిర్మాతలు అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఈశ్వర్, ఎడిటర్ : అమర్ రెడ్డి, మ్యూజిక్ : శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్ : అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి గొట్టిపాటి, నిర్మాత : అవనీంద్ర కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కష్ణచైతన్య.