Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జగమెరిగిన సత్యం'. తిరుపతి పాలే దర్శకత్వంలో అమత సత్యనారాయణ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''జగమెరిగిన సత్యం' టైటిల్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంది. మంచి కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. వినూత్న తరహా కాన్సెప్ట్‌లను బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కోవలోనే ఉన్న ఈ సినిమాకి మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, 1994లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా దర్శకుడు తిరుపతి పాలే తెరకెక్కిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. మేలో సినిమాను థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది. 'ఓ మంచి సినిమాని నిర్మించాననే సంతృప్తి ఉంది. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చే చిత్రమిది. మా దర్శకుడు తిరుపతి పాలే ఈ సినిమాని అద్భుతంగా తీశారు' అని నిర్మాత అచ్చ విజయ భాస్కర్ తెలిపారు.