Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'పెళ్లికూతురు పార్టీ'.
అపర్ణ దర్శకత్వంలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా ఎ.వి.ఆర్.స్వామి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి మాట్లాడుతూ, 'ఇదొక కామెడీ బేస్డ్ మూవీ. దర్శకురాలు అపర్ణ చాలా ఇంట్రెస్ట్‌తో సినిమాను రూపొందించారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా కలిసి చూడదగిన సినిమా. మే 20న సినిమాను విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.
'ప్రపంచవ్యాప్తంగా మా సినిమా మే 20న ఇండియాలోనే కాకుండా యు.ఎస్.లో కూడా రిలీజ్ అవుతుంది. ప్రస్తుత తరానికి సరిగ్గా సరిపోయే సినిమా ఇది. అన్ని వయసుల వారికి నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను' అని దర్శకురాలు అపర్ణ అన్నారు. హీరో ప్రిన్స్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందర్నీ బాగా అలరించింది. శ్రీకర్ అగస్తీ ఇచ్చిన ఆడియో బాగా పాపులర్ అయింది. సినిమా కూడా కొత్తగా ఉంటుంది. అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తునాను' అని చెప్పారు.