Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనదైన కామెడీతో, మేనరిజంతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండిస్టీ పృథ్వీరాజ్ పర్యవేక్షణలో 'కొత్త రంగుల ప్రపంచం' అనే చిత్రం రూపొందుతోంది.
పృథ్వీరాజ్, క్రాంతి కష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా జరిపిన షూటింగ్‌తో ఇప్పటికే ఈ సినిమా 60 శాతం పూర్తయ్యింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో చిత్ర టైటిల్‌ను రివీల్ చేశారు.
ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, 'హీరో, హీరోయిన్లు కొత్త వారైనప్పటికీ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు. ఇద్దరూ బాగా నటించారు. ఇలాంటి మంచి సినిమాలో నేను దర్శకుడి పాత్రలో నటిస్తున్నాను. సంగీత దర్శకుడు శ్రీ సంగీత ఆదిత్య అద్భుతమైన మ్యూజిక్‌ని సమకూర్చాడు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు. 'ఇది నా మొదటి సినిమా. నిర్మాతలు న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. సీనియర్ నటులతో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని హీరో క్రాంతి కష్ణ అన్నారు. హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ, 'గౌతమ్, కమల్ గారు ప్రతి సీన్ క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో నేను చాలా ఈజీగా నటించగలిగాను. మంచి సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు. 'ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ తెలియజేస్తూ సస్పెన్స్ త్రిల్లర్గా సాగే చిత్రమిది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే. అయినా వారిద్దరి నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకుని, ఖర్చుకు వెనుకాడకుండా తీశారు' అని దర్శకుడు పిఆర్ తెలిపారు.