Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమణ్ కథానాయకుడిగా సిరి మూవీస్ బ్యానర్‌పై కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'రెడ్డిగారింట్లో రౌడీయిజం'. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రతి నాయకుడి పాత్ర పోషించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకులు రమేష్, గోపిలతో మంచి అనుబంధం ఉంది. వారి కాంబోలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో హీరోగా, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న రమణ్‌కు సినిమా పెద్ద సక్సెస్ కావాలి' అని చెప్పారు.
'నా అభిమాన నటుడు శ్రీకాంత్‌గారి చేతుల మీదుగా మా చిత్ర ట్రైలర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. దర్శకులు రమేష్, గోపి కమర్షియల్ ఎంటర్టైనర్గా దీన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఈనెల 8న మా చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం' అని హీరో రమణ్ తెలిపారు. చిత్ర దర్శకులు రమేష్, గోపి మాట్లాడుతూ, 'అందర్నీ మెప్పించేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం' అని అన్నారు.