Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా ఇటీవల కథానాయకుడిగా పరిచయం అవుతూ నటించిన 'హీరో' సినిమాతో మంచి విజయం అందుకున్నారు. తొలి సినిమా అందించిన సక్సెస్‌తో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని అంటున్న యువ హీరో గల్లా అశోక్ పుట్టినరోజు నేడు (మంగళవారం). ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'వత్తిపరంగా 'హీరో' సినిమా సక్సెస్‌కి సంతప్తి చెందాను. ఇదొక న్యూ ఏజ్ స్టోరీ. ఈ కథను కామెడీగా చూపించాం. ప్రోగ్రెసివ్ స్టోరీని తెలుగు ఫార్మాట్లో చేయడంతో కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.ఈ సినిమాని మహేష్‌బాబు చూసి, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. థియేటర్ల తర్వాత ఓటీటీ విడుదల నాకు సెకండ్ రిలీజ్‌లా అనిపించింది. పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ మెచ్చుకుంటుంటే నాపై నాకు చాలా నమ్మకం వచ్చింది. నటుడిగా ఇంకా మంచి పేరు తెచ్చు కోవాలనుంది. నా నెక్ట్స్ సినిమాలు, కథలు, పాత్రలు కొత్తగా ఉంటాయి. కమర్షియల్ సినిమాలే కాదు. అన్ని జోనర్ సినిమాలను చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి' అని చెప్పారు.