Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాలో ప్రతిభ ఉందని హీరో వరుణ్ తేజ్ నమ్మారు. ఆయనతో 'తొలి ప్రేమ' సినిమా దగ్గర్నుంచి ట్రావెల్ అవుతున్నా. నా టాలెంట్ చూసి, నీతో సినిమా చేస్తానని చెప్పారు. అంతేకాదు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కథ రెడీ చేయమని కూడా సలహా ఇచ్చారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే 'గని' సినిమా' అని దర్శకుడు కిరణ్ కొర్రపాటి. వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గని'.
అల్లు బాబీ కంపెనీ, రెజనెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిం చారు. అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్త నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు కిరణ్ కొర్రపాటి మీడియాతో మాట్లాడుతూ, 'వరుణ్‌తేజ్ నమ్మకంతో పాటు నా కల కూడా 'గని' సినిమాతో తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కష్టాలను దాటుకుని ఈ సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటే అందుకు ముఖ్య కారణం వరుణ్‌తేజే. ఈ సినిమాకి ఆయనే కర్త, కర్మ, క్రియ. అన్నీ తానై నడిపించాడు. 'తొలిప్రేమ' సినిమా చేస్తున్నప్పుడు వరుణ్ నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఎలాంటి కథ చేయాలా అని అలోచిస్తుంటే, ఏదైన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ ప్రిపేర్ చేరు అని సలహా ఇచ్చారు. మన ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటికే క్రికెట్, ఫుట్‌బాల్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కథని చాలా ఇంటెన్సీవ్‌గా బాక్సింగ్‌లో చూపించగలమని నమ్మి, బాక్సింగ్ నేపథ్యంలో కథ రాసుకున్నాను. కథని అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఇక మేకింగ్ విషయంలో మా నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ అద్భుతంగా నటించింది. ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి పాత్రలు ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి' అని అన్నారు.