Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' .శరత్ మండవ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ జర్నీ మొదలైయింది. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మొదటి పాట 'బుల్ బుల్ తరంగ్'ను ఇటీవల రిలీజ్ చేశారు.
'రవితేజ పాత్రలోని రొమాంటిక్ యాంగిల్‌ని ఈ పాట ఆవిష్కరించింది. రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఫారిన్ డ్యాన్సర్లతో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించడం అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అలాగే రవితేజ వేసిన డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ కూల్ అండ్ క్లాస్‌గా ఉండటంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ పాటకు సామ్ సిఎస్ స్వర పరిచిన ట్యూన్ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా చేసింది. ఈ పాటకు రాకేందు మౌళి చక్కని సాహిత్యాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సూపర్ హిట్ పాటతో ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా మొదలయ్యాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్గా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటు రవితేజ అభిమానుల్లో, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.