Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో రూపొందుతున్న అందమైన ప్రేమకథా చిత్రానికి 'సీతా రామం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ''యుద్ధంతో రాసిన ప్రేమకథ'' అనేది ట్యాగ్‌లైన్. హను రాఘవపూడి దర్శకుడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మణాళిని ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, రష్మిక మందన్న కీలకమైన పాత్రలో మెరవబోతున్నారు.
ఇటీవల శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎనౌన్స్ చేసిన టైటిల్‌కు సర్వత్రా మంచి స్పందన లభించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
'టైటిల్ గ్లింప్స్‌లో 'ఇది ఓ సైనికుడు శత్రుకి అప్పగించిన యుద్దం ఆఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి' అనే డైలాగ్ టైటిల్‌కి తగ్గట్టు అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ తర్వాత ఆఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న రివిల్ కావడం, తర్వాత సీత పాత్రలో హీరోయిన్ మణాళిని, రాముడి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించడం ఆసక్తికరంగా ఉంది. యుద్ధం నేపధ్యంలో సాగే ఈ ప్రేమ కథలో లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. టైటిల్ వీడియోలో దుల్కర్ సల్మాన్, మణాళిని ఠాకూర్, రష్మిక మందన్న అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని అర్ధమౌతుంది. వెటరన్ సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఎప్పటికప్పుడు భిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న మా కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతోనూ కచ్చితంగా ఆకట్టుకుంటారు. ఇందులో ఆయన పోషిస్తున్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుగు తెరపై ఇంతవరకూ ఈ తరహా పాత్రను చూడలేదు. ఈ చిత్రకథను దర్శకుడు హను రాఘవపూడి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సీతగా మృణాళిని ఠాకూర్, అఫ్రీన్‌గా రష్మిక మందన్నా పాత్రలు అందర్నీ కచ్చితంగా మెస్మరైజ్ చేస్తాయి. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు, ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి.