Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నూతన తారలతో ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాలం రాసిన కథలు'. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''కాలం రాసిన కథలు' టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి, అలాగే చిత్రంలో నటించిన నటీనటులకు, పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్‌లో నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన సాగర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నమ్మకానికి, మోసానికి మధ్య నలిగిపోతున్న మనిషి కథలు అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వస్తోంది' అని హీరో అభిలాష్ గోగుబోయిన తెలిపారు. దర్శక, నిర్మాత ఎమ్‌ఎన్‌వి సాగర్ మాట్లాడుతూ, 'ఉన్నతమైన విలువలతో ఊహించని ట్విస్ట్‌లతో నేను రూపొందిస్తున్న ఈ సినిమాకి నాతో పాటుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నాం. త్వరలోనే విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తాం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.