Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో 'శుక్ర' దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా 'మాటరాని మౌనమిది'. ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ పొందిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్ స్టొరీని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌తో మిక్స్ చేసి, మల్టి జోనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
'నువు మాట్లాడేదాకా మట్టి నీ కింద ఉంటుంది. మాట్లాడటం ఆగిన తర్వాత ఆ మట్టి నీ పైన ఉంటుంది అనే డైలాగ్‌తో పాటు హీరో, హీరోయన్ల మధ్య లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
గ్లింప్స్ చివర్లో వచ్చిన షాట్స్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను రివీల్ చేస్తున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, దర్శకుడు : సుకు పూర్వాజ్.