Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రౌడీ బాయ్సు' చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'సెల్ఫిష్' టైటిల్‌తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా, దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'మా ఆశిష్ 'రౌడీ బార్సు' చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు. సుకుమార్, నేను 'ఆర్య' సినిమాకు పనిచేశాం. ఇద్దరం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. 'సెల్ఫిష్' అనే ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. పర్పెక్ట్గా స్టోరీ సెట్ అయ్యింది. ఆశిష్‌కు మొదటి సినిమా టైలర్ మేడ్. కానీ ఈ సినిమా అతనికి ఛాలెంజ్ లాంటిది' అని తెలిపారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మణికందన్.ఎస్, సంగీతం : మిక్కీ జే మేయర్, ఆర్ట్ : యల్లయ్య. ఎస్, సాహిత్యం : చంద్రబోస్, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, రచన దర్శకత్వం - విశాల్ కాశీ.