Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు ఫేమ్) హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'హూ ఆర్ యు'. శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తున్నారు.
సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ కొట్టగా, లలిత కెమెరా స్విచ్చాన్ చేశారు.
రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా గురించి నిర్మాత బొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ, 'మా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్లో రెండో చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నాం. ప్రియా నాయుడు మంచి కథ అందించారు. మంచి టీమ్ కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సస్పెన్స్, క్రైమ్, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి (శుక్రవారం) నుండే ప్రారంభమవుతుంది. ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాం. వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.
'సస్పెన్స్, క్రైమ్ జోనర్ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా వాటికి చాలా విభిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. నిర్మాతతోపాటు టీమ్ మొత్తం మంచి సపోర్ట్ అందిస్తున్నారు. సురేష్ సపవత్, సత్నా టైటస్ జంట ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇతర ముఖ్యపాత్రలలో నటించే వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. నన్ను నమ్మి ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత భూలక్ష్మిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని దర్శకుడు వైకుంఠ్ బోణు చెప్పారు.
'కథ చాలా బాగుంది. ముఖ్యంగా మా పాత్రల్లో నటనకు మంచి స్కోప్ దొరికింది. ఈ సినిమా మాకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కథ, కథనం, సంగీతం.. నటీనటుల నటన.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తాయి' అని నాయకానాయికలు సురేష్ సపవత్, సత్నా టైటస్ అన్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్: శ్రీనివాస్ తేజ, సినిమాటోగ్రఫీ: సురేష్ గొంట్ల, ఆర్ట్: వెంకటేష్ గుల్ల, ప్రొడక్షన్ కంట్రోలర్: మాషా బత్తిని శివ.