Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శుక్రవారం మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ అప్డేట్ని షేర్ చేశారు.
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే ఈ చిత్రంలోని ప్రత్యేకమైన పార్టీ సాంగ్‌లో నటిస్తోంది. ఈ పాట చిత్రీకరణ కోసం పూజా శుక్రవారం షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యింది. అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.
'ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనుగుణమైన, ఆకర్షణీయమైన ట్యూన్‌ను రూపొందించారు. ఈ పార్టీ సాంగ్‌లో మరో విశేషమేమిటంటే పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణమైన వెంకటేష్, వరుణ్ తేజ్, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వీళ్లందరినీ ఒకేసారి స్క్రీన్ పై చూడటం అటు వాళ్ళ అభిమానులకు, ఇటు ప్రేక్షకులకూ కన్నుల పండగగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. 'ఎఫ్2' లో నటించిన రాజేంద్రప్రసాద్ 'ఎఫ్3'లోనూ భాగం కాగా, సునీల్ ఈ చిత్రానికి మరో ఎస్సెట్‌గా నిలవబోతున్నారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. భార్యల వల్ల భర్తలు పడే పాట్లని ఇతివృత్తంగా తీసుకుని, ఆద్యంతం వినోదభరితంగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్2' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో అఖండ విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ఎఫ్3'ని కూడా డబ్బు చుట్టూ కథని తిప్పుతూ మరోసారి అందర్నీ పడి పడి నవ్వుకునేలా చేసేందుకు దర్శకుడు అనిల్‌రావిపూడి ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఈ సినిమా పేరు ఉండటం ఖాయమనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా సష్టించడానికి ఈ సినిమా రెడీ అవుతోంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డిఓపీ : సాయి శ్రీరామ్,
కళ: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఎస్ కష్ణ, అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.