Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేడీ చక్రవర్తి..
విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొంది, సంచలన విజయం సాధించిన 'శివ' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా.. అందర్నీ మెప్పించారు. శనివారం ఆయన పుట్టినరోజు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితుల నుంచి బెస్ట్ విషెస్ ఆయన అందుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేడీ చక్రవర్తి కార్యాలయంలో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 'మనీ', 'రక్షణ', 'వన్ బై టూ',
'అనగనగా ఒక రోజు', 'గులాబీ', 'బొంబాయి ప్రియుడు', 'ఎగిరే పావురమా', 'సత్య', 'ప్రేమకు వేళాయెరా' వంటి తదితర సినిమాలతో తెలుగు తెరపై తనదైన మార్క్ నటనతో అలరించి, తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఒకానొక సమయంలో హీరోగా ట్రెండ్ క్రియేట్ చేశారు కూడా. రీసెంట్గా 'ఎంఎంఓఎఫ్' అనే థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకున్నారు. 'హోమం', 'సిద్ధం' వంటి తదితర సినిమాలను రూపొందించి,
అభిరుచిగల దర్శకుడి గానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా క్రియాశీల నటుడిగా వెలుగొందుతున్న ఆయన ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హిందీలో 'ఏక్ విలన్' పార్ట్- 2, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, 'దహిని'తో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అలాగే సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. తమిళంలో సింగం ఫిలిం ప్రొడక్షన్ వారి ప్రతిష్టాత్మక సినిమా 'కర్రీ'లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే 'పట్టరారు' అనే మరో తమిళ సినిమాలోనూ భాగమవుతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం కన్నడలోనూ రెండు సినిమాల్లో జెడీ నటిస్తున్నారు. అందులో ఒకటి జోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రేమ్' కాగా, మరొకటి థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ 'హూ'. అలాగే తెలుగులో మాంగో ప్రొడక్షన్స్ వారితో 'బ్రేకింగ్ న్యూస్', జేకే క్రియేషన్స్ బ్యానర్‌పై 'ది కేస్' సినిమాలు చేస్తున్నారు. మలయాళంలోనూ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. మొత్తమ్మీద పాన్ ఇండియా నటుడిగా జెడీ బిజీగా ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు.