Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'.
ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ శనివారం రిలీజ్ చేశారు. '2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తనకు వచ్చిన సమస్య పై జయమ్మ పంచాయితీ పెట్టడం, గ్రామ పెద్దలు జయమ్మ సమస్యని తేలికగా తీసుకోవడం, జయమ్మ ఎదురు తిరగడం.. ఇలా కథ, సినిమా పై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉంది. ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా' అని జయమ్మగా సుమ పలికిన డైలాగ్ నవ్వులు పూయించాయి. ట్రైలర్లో వినిపించిన డైలాగ్స్‌ని నటులంతా ఉత్తరాంధ్ర మాండలికంలో చక్కగా పలకడం విశేషం. అలాగే జయమ్మ పాత్రలో సుమ కనిపించిన తీరు అద్భుతంగా ఉండటంతో పాటు సహజంగా, ప్రేక్షకులు చాలా సులువుగా ఆ పాత్రకి కనెక్ట్ అయ్యేలా ఉంది. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథని ఈ చిత్రంతో ప్రేక్షకులకు చూపించ బోతున్నారనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎం.ఎం.కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విజరు కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.