Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లంబసింగి..' ఆంధ్రా కశ్మీర్‌గా పాపులరైన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో దర్శకుడు కళ్యాణ్ కష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ... 'బిగ్ బాస్' దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ తన్నీరు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎ ప్యూర్ లవ్ స్టోరీ... అనేది ఉపశీర్షిక. ఇందులోని తొలి పాట 'నచ్చేసిందే నచ్చేసిందే...'ను అగ్ర కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా రూపొందిన 'నచ్చేసిందే నచ్చేసిందే...' పాట ప్రేక్షకుల అందరికీ నచ్చేసింది. ఆర్ఆర్ ధవన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. 'నచ్చేసిందే నచ్చేసిందే...
నాకెంతో నచ్చిందే ఈ పిల్ల..' అంటూ సాగిన ఈ గీతానికి కాస్లర్య శ్యామ్ సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'నా దర్శకుడు కళ్యాణ్ కష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ, నిర్మించిన సినిమా 'లంబసింగి'. ఇందులో 'బిగ్ బాస్' దివి కథానాయికగా నటించింది. ఇందులో తొలి పాట 'నచ్చేసిందే నచ్చేసిందే...'ను వినండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
'విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలో గాఢతను తెలిపే గీతం 'నచ్చేసిందే నచ్చేసిందే'. సిద్ శ్రీరామ్ గాత్రం, కాస్లర్య శ్యామ్ సాహిత్యం, ఆర్ఆర్ ధవన్ సంగీతం నచ్చేశాయని ప్రేక్షకులు చెబుతుంటే సంతోషంగా ఉంది. చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం' అని దర్శకుడు నవీన్ గాంధీ తెలిపారు.