Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీజేఆర్ ఫిలింస్ బ్యానర్ పై ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ టి. రాజు సమర్పణలో పి.జనార్థన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'హర్రర్ విత్ టెర్రర్'. వంశీరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆదివారం రోజు ఫిలిం ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ,'చిన్న సినిమాలైనప్పటికీ మంచి క్వాలిటీతో నిర్మిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మాత పి.జనార్థన్‌రెడ్డి రూపొందించడం చాలా సంతోషకరం. దర్శకుడు వంశీ రాజు చాలా బాగా తీశాడు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు.
హీరోయిన్ స్వర్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. ఇందులో నేనొక మంచి పాత్ర చేశాను. ఈ చిత్రం మంచి విజయం సాధించి, నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను' అని చెప్పారు.
'మా సొంత బ్యానర్లో గత కొన్ని సంవత్సరాలుగా పలు చిత్రాలు నిర్మించాం. దర్శకుడు వంశీ రాజు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. టాలెంట్ ఉన్న వారిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను' అని నిర్మాత జనార్థన్ రెడ్డి తెలిపారు.
దర్శకుడు వంశీ రాజు మాట్లాడుతూ,'ఇది చిన్న సినిమా అయినా మంచి క్వాలిటీతో నిర్మించాం. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు వస్తుంది. నిర్మాత జనార్థన్‌రెడ్డి సహకారంతో చిత్రాన్ని పూర్తి చేశాం. ఓ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి' అని చెప్పారు.