Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా 'గూడాచారి', 'ఎవరు', 'హిట్' లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్‌గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా, నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నిఖిల్ పాత్రకు తగట్టు 'స్పై 'అని టైటిల్‌ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. టైటిల్ పోస్టర్ డిజైన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. గన్స్, బుల్లెట్లు, స్నిప్పర్ గన్ స్కోప్‌తో పాటు టైటిల్ లెటర్ని గన్ షేప్‌లో సాలిడ్‌గా డిజైన్ చేశారు. టైటిల్ పోస్టర్లో నిఖిల్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంట్, క్లాసిక్ ఏవియేటర్స్ ధరించి, చేతిలో గన్‌తో సూపర్ స్టైలిష్ 'స్పై'గా కనిపించారు నిఖిల్. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
సరికొత్త గెటప్, పాత్రలో కనిపించనున్న 'స్పై'ని నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిర్మాతలు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దసరా పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
నిర్మాత కె. రాజశేఖర్‌రెడ్డి ఈ చిత్రానికి కథ అందించగా, బిహెచ్ గ్యారీ ఎడిటింగ్ భాద్యతలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది.
ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ ఎస్ట్రాడా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా, ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అర్జున్ సూరిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్‌గా రవి ఆంథోని పని చేస్తున్నారు. ఇదే బ్యానర్లో మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. వీటిల్లో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ఉండనుందని మేకర్స్ తెలిపారు. అభినవ్ గోమటం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం, ఎడిటర్: గ్యారీ బిహెచ్, రచయిత: అనిరుధ్ కష్ణమూర్తి.