Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈనెల 22న 'ఆ.. ఆహా.. ఆహా..ఆహా' అంటూ సాగే పాటని చిత్ర బృందం రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆడుతూ కనిపించారు.
'ఒక వైపు నాయికలు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ తాడు లాగుతుండగా, మరోవైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్లో వరుణ్ని ప్రోత్సహించడం అందర్నీ అలరిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో నటిస్తుండగా, అగ్ర కథానాయిక పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో సందడి చేయనుంది. ఇటీవల విడుదల చేసిన 'ఎఫ్3' థీమ్ సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. ఈనెల 22న విడుదల చేయబోయే 'అ..ఆహా..' పాట సైతం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.