Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు ఎస్వీ. కష్ణారెడ్డి చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు'. కంప్లీట్ ఫ్యాామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోయే ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా, 'మజిలీ' ఫేమ్ అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు. అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజరు గోష్, రాజా రవీంద్ర తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్, హీరోయిన్ అనన్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'కష్ణారెడ్డి నాతో 'కొబ్బరి బొండం', 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'మాయలోడు' వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వంలో నటిచడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకుని, ఎంజారు చేసేలా ఉంటుంది' అని చెప్పారు.
'దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. నా మార్క్ కామెడీ సినిమాలు రావడం లేదని ఈమధ్య చాలా మంది అడిగారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉండే సినిమా ఇది' అని దర్శకుడు ఎస్వీ కష్ణారెడ్డి తెలిపారు. 'చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కృష్ణారెడ్డిగారు ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మార్క్ మేకింగ్‌తో ఈ సినిమా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా అందర్నీ తప్పకుండా అలరిస్తుంది' అని నిర్మాత కె.అచ్చిరెడ్డి అన్నారు.