Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కరణ్ అర్జున్'. రోడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాతలు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ సోమవారం అగ్ర దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''కరణ్ అర్జున్' టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్రజెంట్ ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యే స్టోరి ఇది. టీమ్ అందరూ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. 'ఇంత వరకు ఎవరూ చేయని లొకేషన్స్‌లో ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డర్లో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా చిత్రీకరణ చేశాం. మూడు పాత్రలతో, ఊహించని మలుపులతో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగే రోడ్ థ్రిల్లర్ చిత్రమిది' అని దర్శకుడు మోహన్ శ్రీవత్స తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల మాట్లాడుతూ, 'నేను ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానే కాకుండా కొరియోగ్రఫీ కూడా చేశాను. ఇందులో రెండు పాటలున్నాయి. ఒక పాట కశ్మీర్లో చేశాం. మరో పాట రాజస్థాన్‌లో చేశాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని చెప్పారు.