Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోహెల్, అనన్య (వకీల్‌సాబ్ ఫేమ్) జంటగా నటిస్తున్న చిత్రం 'బూట్ కట్ బాలరాజు'. లక్కీ మీడియాతో కలిసి గ్లోబల్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి దర్శకుడు. సోమవారం సోహెల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్ర గ్లింప్స్ విడుదల చేసింది.
'రింగు రింగు రూపారు బిళ్ళ రూపాయి దండ.. అంటూ సాగే పాటతోపాటు ఈ గ్లింప్స్‌లో సోహెల్ యాక్షన్ సీన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఊరికి ఒక మంచి పని చేసినావ్‌ర్రా అంటూ ఒకరు అడిగితే.. సోహెల్ చెప్పే సమాధానం ఫుల్ ఎంట్‌టైన్ చేస్తుంది. రచయిత ఫణి, రాకేష్, అశోక్ కుమార్ టీమ్‌గా ఓ మంచి కథను అందించారు. 9 నెలలుగా కథను రెడీ చేసి చిత్రీకరణకు వెళ్ళాం. ఏకధాటిగా సాగిన చిత్రీకరణతో సినిమా ముగింపు దశకు చేరుకుంది. మా కథానాయకుడు సోహెల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కు మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. కుటుంబంతో కలిసి హాయిగా చూడదగిన సినిమా ఇది. త్వరలో మరిన్ని వివరాలు ఎనౌన్స్ చేస్తాం' అని చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. కథానాయకుడు సోహెల్ మాట్లాడుతూ, 'కథ బాగుంటే అన్నీ కలిసి వస్తాయి. బిగ్‌బాస్‌లో వచ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వచ్చే పేరు వేరు. అందుకే నన్ను నమ్మి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేలా కషి చేస్తున్నాను' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా : గోకుల్, సంభాషణలు: ఫణి, రాకేష్, అశోక్ కుమార్, సంగీతం: భీమ్స్, సాహిత్యం: కాసర్ల శ్యామ్, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, బాష.