Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవి, వెన్నెల హీరో, హీరోయిన్లుగా అవంతి ఎంటర్టైనర్, తారా క్రియేషన్స్ బ్యానర్ల పై రూపొందుతున్న చిత్రం 'వాడే వీడు'. శ్రీపతి శివ కుమార్ నిర్మాణ సారథ్యంలో డా. గోపికష్ణ కోరుకుండను దర్శకుడిగా పరిచయం చేస్తూ బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. వైజాగ్ డాబా గార్డెన్స్‌లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో విజెఏ ఫ్లో సిఐ స్వర్ణలత పాల్గొని చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'స్థానిక కళాకారులకు అవకాశాన్ని కల్పిస్తూ సినిమా చేయటం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అన్నీ ఇక్కడే నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి ఆదరణ పొంది, అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను' అని చెప్పారు.
'యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ప్రేమ కథా చిత్రమిది. చిత్రీకరణతోపాటు శ్యామ్ గారి ఎమ్ఎస్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాం. విశాఖలో సినీ పరిశ్రమ ఎదుగుదలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రోత్సాహం అందిస్తానని చెప్పటం మాకెంతో స్ఫూర్తిదాయకం' అని దర్శకుడు డా. గోపికష్ణ కోరుకొండ తెలిపారు.
నిర్మాణ సారథి శ్రీపతి శివకుమార్ మాట్లాడుతూ, 'ఎమ్.ఎల్.రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య ద్వారా ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర విజయం ద్వారా మాకు, పరిశ్రమ వైజాగ్‌లో స్థిరపడడానికి దోహదపడగలదని ఆశిస్తున్నాను' అని అన్నారు.
అనిల్ కుమార్, దార్ల బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి, సన్నీ బాబు, హరి కిరణ్, హేమంత్, కళ్యాణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎమ్.సత్య రవికుమార్, కెమెరా: పి.హేమ వర్ధన్ రెడ్డి, ఎడిటింగ్: నరేష్ కుమార్ మడికి, నత్యాలు: బెన్ని మాస్టర్, ఆర్.పవన్, నిర్మాత: బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి, రచన- దర్శకత్వం: డా. గోపికష్ణ కోరుకొండ.