Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట.. సింబా రింబ సింబా రింబ సరదా పులుల సయ్యాట.. భలే భలే బంజారా మజా మందేరా రేయి కచేరీలో రెచ్చిపోదాం రా..' అంటూ ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేసిన ఈ పాట ప్రస్తుతం సర్వత్రా మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆచార్యగా చిరంజీవి, సిద్ధగా రామ్‌చరణ్ ఈ పాటలో వేసిన స్టెప్పులు చూసి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ పాటను చూస్తే, వీళ్ళకి అడవిలో ఏం పని?, వారిని చూసి ఆడవి బిడ్డలు ఎందుకు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు? అనే ప్రశ్నలొస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'ఆచార్య' సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక, నిర్మాతలు.
'ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో మేకర్స్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, రెండు పాటలకు, తాజాగా సోమవారం రిలీజైన 'భలే భలే బంజారా..' పాటకూ టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలోని ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారు. పాట వినసొంపుగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్యూన్‌కి తగ్గటు ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు ఆయన తనయుడు రామ్ చరణ్ వేసిన స్టెప్స్ అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇద్దరూ పోటీ పడి డాన్స్ చేసిన ఈ పాట థియేటర్లో ప్రభంజనం సష్టించడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆచార్య'. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29 విడుదల చేస్తున్నారు. ఈనెల 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.